ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇళ్ల పట్టాల పంపిణీలో వీఆర్వో చర్యపై ఎమ్మెల్యే ఆగ్రహం - mla vamshi fire on gannavram vro

ఇళ్లపట్టాల పంపిణీలో అవినీతికి పాల్పడిన వీఆర్వోపై ఎమ్మెల్యే వంశీ మండిపడ్డారు. 70 పట్టాలను దాచిన వీఆర్వో పై ఆగ్రహం వ్యక్తం చేసి.. బాధితులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. వీఆర్వోను సస్పెండ్ చేయాలని కృష్ణా జిల్లా గన్నవరం గ్రామస్థులు డిమాండ్ చేశారు.

mla vamshi
ఇళ్ల పట్టాల పంపిణీలో వీఆర్వో అవినీతిపై మండిపడ్డ ఎమ్మెల్యే

By

Published : Jan 8, 2021, 4:00 AM IST

కృష్ణా జిల్లా గన్నవరం బాలుర పాఠశాల మైదానంలో జరిగిన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీ.. వీఆర్వో రఖీబ్ అవినీతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 70మంది ఇళ్ల స్థలాల పట్టాలను దాచాడన్న బాధితుల ఫిర్యాదుతో వీఆర్వో రఖీబ్ వైఖరి​పై మండి పడ్డారు. పట్టాలపై రెవెన్యూ సంతకాలు లేకపోవటంతో ఎమ్మార్వో నరసింహారావు సైతం ఆశ్యర్యానికి గురయ్యారు. తక్షణమే 70 పట్టాలపై తహసీల్దార్ నరసింహారావు సంతకాలు చేసి, బాధితులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను అందజేశారు. సదరు వీఆర్వోను సస్పెండ్ చేయాలని గన్నవరం గ్రామస్థులు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details