మూడు రాజధానుల నిర్ణయాన్ని జగన్ మార్చుకోకుంటే అమరావతి ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తామని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హెచ్చరించారు. దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులు సైతం అమరావతి ఉద్యమంపై ఆరా తీస్తున్నారన్న ఆయన అందరినీ కలుపుకునే విధంగా తదుపరి కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు.
'ఆ రైతులు కూడా అమరావతి ఉద్యమంపై ఆరా తీస్తున్నారు' - అమరావతి ఉద్యమానికి 365 రోజులు తాజా వార్తలు
అమరావతి ఉద్యమం ప్రారంభమై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మంగళవారం విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హెచ్చరించారు. రాజకీయ, ప్రజా సంఘాలతో పాటు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి రైతులకు అండగా నిలవాలని ఆయన కోరారు.
అమరావతి విషయంలో కేంద్రం తమకు సంబంధం లేనట్లు వ్యవహరించటం సరికాదని హితవు పలికారు. ప్రజాపోరాటం ద్వారా అమరావతిని అంతా కలిసి కాపాడుకుందామని పిలుపునిచ్చారు. అమరావతి ఉద్యమం ప్రారంభమై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మంగళవారం విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం బీఆర్టీఎస్ రోడ్డులో జరిగే మహార్యాలీలో వేల మంది ప్రజలు పాల్గొననున్నట్లు వెల్లడించారు. రాజకీయ, ప్రజాసంఘాలతో పాటు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి రైతులకు అండగా నిలవాలని ఆయన కోరారు.
ఇవీ చూడండి...