ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మాట తప్పడంలో సీఎం జగన్ చరిత్ర సృష్టించారు' - వైకాపా ప్రభుత్వ తీరుపై తెదేపా ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి తీవ్ర ఆగ్రహం

వైకాపా ప్రభుత్వ తీరుపై తెదేపా ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ల మొత్తాన్ని పెంచి అర్హులైన వారికి లబ్ధి చేకూర్చాలని డిమాండ్ చేశారు.

MLA dola bala veeranjaneya swamy
తెదేపా ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి

By

Published : Sep 2, 2020, 1:00 AM IST

మాట తప్పడంలో సీఎం జగన్ చరిత్ర సృష్టించారని తెదేపా ఎమ్మెల్యే డోలా బాల వీరంజనేయస్వామి ఆరోపించారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఇచ్చే పింఛన్​ మొత్తాన్ని ఏటా రూ. 250 చొప్పున పెంచుతానని చెప్పి... వారిని మోసం చేశారని అన్నారు. ఇప్పటికైనా పింఛన్ల మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ ముసుగులో ఉన్న కార్యకర్తల ఆగడాలతో... అర్హత ఉన్న దళిత, గిరిజన లబ్ధిదారులు అనర్హులుగా మిగిలిపోతున్నారని మండిపడ్డారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details