రాష్ట్రంలో 30 లక్షల ఇళ్లపట్టాలు పేదలకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తే చంద్రబాబు కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారని ప్రభుత్వ చీఫ్ విప్, వైకాపా ఎమ్మెల్యే దాడి శెట్టి రాజా అరోపించారు. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని సంక్షేమ పథకాలను చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ఎంత అడ్డుకున్నా పేదలకు మంచే జరుగుతుందన్నారు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని ఆరోపించారు. రాష్ట్రం కంటే తన రియల్ ఎస్టేట్ వ్యాపారులు బాగుండాలనే కోరుకుంటారని ధ్వజమెత్తారు.
'సంక్షేమ పథకాలను చంద్రబాబు అడ్డుకుంటున్నారు' - updates on lands to poor
వ్యవస్థలను అడ్డుపెట్టుకుని సంక్షేమ పథకాలను చంద్రబాబు అడ్డుకుంటున్నారని ప్రభుత్వ చీఫ్ విప్, వైకాపా ఎమ్మెల్యే దాడి శెట్టి రాజా అన్నారు. 30 లక్షల ఇళ్ల పట్టాలు పేదలకు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు.
ఎమ్మెల్యే దాడి శెట్టి రాజా
వైకాపా నేత హత్యకు ముందు, తర్వాత కొల్లు రవీంద్రకు ఫోన్ చేసి చంద్రబాబు మాట్లాడారని దాడిశెట్టి రాజా అన్నారు. కొల్లు రవీంద్ర అమాయకుడని చంద్రబాబు వెనకేసుకుని వస్తూ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడులు తప్పు చేశారు కాబట్టే పోలీసులు అరెస్టు చేశారని అన్నారు.
ఇదీ చదవండి: హైకోర్టు స్టే వల్లే ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదా: మంత్రి రంగనాథరాజు