కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలోని కోడూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. రూ.78 లక్షల వ్యయంతో సచివాలయం, ఆర్.బి.కె, వైఎస్సార్ క్లీనిక్ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకు నియోజక వర్గ పరిధిలో అభివృద్ధి పనులకు రూ.85 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 50 సచివాలయ భవనాలు, 62 రైతు భరోసా కేంద్రాలు నిర్మాణంలో వున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. వైఎస్సార్ ఆసరా పథకం లబ్ధిదారులు ఏర్పాటు చేసిన పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు.
అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన - mailavaram constituency latest news
కృష్ణా జిల్లా కోడూరులో పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు నియోజక వర్గ పరిధిలో అభివృద్ధి పనులకు రూ.85 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు.

అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన