సీఐ తీరుపై ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సీపీకి ఫిర్యాదు - cp
సార్వత్రిక ఎన్నికల్లో కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసు అధికారి వ్యవహరించిన తీరును ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఖండించారు. సీపీకి సీఐ పెద్దిరాజుపై ఆధారాలతో సహా సీపీకి అందజేసినట్లు పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసు అధికారి వ్యవహార శైలిపై స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి బోడె ప్రసాద్ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పెనమలూరు సీఐ పెద్దిరాజు... వైకాపా నేతలతో చేతులు కలిపి తెలుగుదేశానికి వ్యతిరేకంగా వ్యవహరించారని విజయవాడ సీపీ ద్వారకా తిరుమల రావుకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో సీఐ పెద్దిరాజు వ్యవహరించిన తీరుపై పలు ఘటనలను ఆధారాలతో సహా సీపీకి అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తటస్థంగా ఉండాల్సిన పోలీసులు ఇలా చేయడం సహేతుకం కాదని వెంటనే సీఐపై విచారణ జరిపి తగు చర్యలు తీసకోవాలని సీపీని కోరినట్లు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు.