కృష్ణా జిల్లాలోని తోట్లవల్లూరు మండలం కలాసుమాలపల్లిలో... నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా పామర్రు ఎమ్మెల్యే అనిల్ కుమార్ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంలో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. కలాసుమాలపల్లిలో సొసైటీ భూముల విషయమై వైకాపా -తెదేపా వర్గీయుల మధ్య కొన్నేళ్లుగా ఘర్షణ కొనసాగుతోంది. అయితే తమను వెలివేశారంటూ ఎమ్మెల్యే ముందు మహిళలు ఆవేదనను వ్యక్తం చేశారు. ఘర్షణ పడకుండా... శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈనెల 16 తరువాత ఇరువర్గాలతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ కుమార్ హామీ ఇచ్చారు.
తమను వెలివేశారంటూ కలాసుమాలపల్లిలో మహిళల ఆవేదన - కలాసుమాలపల్లిలో మహిళల సామాజిక వెలివేత తాజావార్తలు
కృష్ణా జిల్లాలోని తోట్లవల్లూరు మండలం కలాసుమాలపల్లిలో గందరగోళం నెలకొంది. నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా పామర్రు ఎమ్మెల్యే అనిల్ కుమార్ పాదయాత్ర చేశారు. అయితే కలాసుమాలపల్లిలో సొసైటీ భూముల విషయమై వైకాపా - తెదేపా వర్గీయుల మధ్య కొన్నేళ్లుగా ఘర్షణ కొనసాగుతుండటంతో... తమను సామాజికంగా వెలివేశారంటూ మహిళలను ఆవేదన చెందారు. వారి సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
కలాసుమాలపల్లిలో మహిళల సామాజిక వెలివేత... సమస్య పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామి
Last Updated : Nov 13, 2020, 12:31 PM IST