ఐదు రోజుల క్రితం మచిలీపట్నంలో కనిపించకుండాపోయిన ఓ మహిళ తెలంగాణ నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి వద్ద హత్యకు గురికావడం కలకలం సృష్టించింది. నగరంలోని సర్కిల్ పేటలో నివాసం ఉంటున్న పద్మ అనే మహిళ నగరంలోని ఓ రెస్టారెంట్లో కొన్ని సంవత్సరాలు నుంచి పనిచేస్తోంది. ఆగస్టు 31వ తేదీ ఉదయం పనికోసం బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో... బంధువులు కనిపించడం లేదంటూ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి వద్ద సగం కాలిన స్థితిలో మహిళా మృతదేహాన్ని గుర్తించారు అక్కడి పోలీసులు. అది పద్మ అని నిర్ధరించుకొని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. మచీలీపట్నం పోలీసులు నార్కెట్పల్లి నుంచి మృతదేహాన్ని తీసుకొచ్చి హత్యకు గల కారణలపై దర్యాప్తు చేస్తున్నారు.
మచిలీపట్నంలో అదృశ్యమైన మహిళ దారుణ హత్య - Machilipatnam news
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అదృశ్యమైన ఓ మహిళ తెలంగాణ నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి వద్ద దారుణ హత్యకు గురైంది. నగలు, డబ్బు కోసమే పద్మను చంపారని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మచిలీపట్నంలో అదృశ్యమైన మహిళ దారుణ హత్య