కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన మద్దాలి పుష్ప కుమారుడు విశాఖ్ ఓ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఈ కుర్రాడికి చదువుకోవటం ఇష్టం లేక గుడివాడలో ఉంటున్న అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళతానని ఇంటిలో చెప్పి అదృశ్యమయ్యాడు. రెండు రోజులైనా విశాఖ్ గుడివాడ చేరుకోకపోయేసరికి అనుమానం వచ్చిన తల్లి పుష్ప... పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మచిలీపట్నం మంగినపూడి బీచ్లో గుర్రాలు యజమాని వద్ద కూలీ పని చేస్తున్న విశాఖ్ను గుర్తించిన తల్లిదండ్రులకు అప్పగించారు.
చదువుకోవటం ఇష్టంలేక పారిపోయిన విద్యార్థి - vijayawada
కొందరికి చదువుకుందామన్న కొన్ని పరిస్థితుల వల్ల కుదరదు. మరికొందరికి చదువంటేనే గిట్టదు. అలాంటి ఓ కుర్రాడే 2 నెలల క్రితం ఇంటి నుంచి పారిపోయి కూలిపని చేస్తూ...పోలీసుల కంటబడ్డాడు. వెంటనే కుర్రాడిని తల్లిదండ్రులకు అప్పగించారా పోలీసులు
అదృశ్యమైన బాలుడిని తల్లి చెంతకు చేర్చిన పోలిసులు