కృష్ణా జిల్లా నందిగామ చందాపురానికి చెందిన ఉన్నం సైదులు తల్లి పదేళ్ల క్రితం తప్పిపోయింది. విజయవాడ నుంచి తప్పిపోయిన సుబ్బలక్ష్మి గుజరాత్లో పదేళ్ల పాటు జీవనం సాగించింది. రైల్వేస్టేషన్లో ఉన్న ఆమెను అహ్మదాబాద్ పోలీసులు రహెనేకి సువిథా అనే ఆశ్రమంలో చేర్చారు. ఇటీవల కాలంలో రాధాకృష్ణ అనే తెలుగు వ్యక్తి గుజరాత్ వెళ్లిన సందర్భంలో సుబ్బలక్ష్మి తెలుగు మాట్లాడటం గమనించి... కృష్ణా జిల్లా ఎస్పీకి సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ రవీంద్రబాబు నందిగామ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ప్రత్యేక టీమ్‌ను గుజరాత్‌కు పంపించి సుబ్బలక్ష్మిని నందిగామకు తీసుకొచ్చి కుమారుడికి అప్పగించారు. పదేళ్ల తర్వాత తన తల్లిని కలుసుకున్నందుకు కుమారుడు ఆనందం వ్యక్తం చేశాడు. పోలీసులకు ధన్యవాదాలు తెలిపాడు.
తప్పిపోయిన పదేళ్లకు కుమారుడి చెంతకు చేరిన తల్లి - కృష్ణా జిల్లాలో తప్పిపోయిన మహిళా న్యూస్
కృష్ణా జిల్లా నందిగామ చందాపురంకు చెందిన ఓ మహిళ పదేళ్ల క్రితం తప్పిపోయింది. రాష్ట్రం కాని రాష్ట్రంలో... భాష తెలియని ప్రాంతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ తల్లి బాధ చూసి దేవుడు కరుణించాడో ఏమో కానీ పదేళ్ల తర్వాత ఆమె తన కుమారుడి చెంతకు చేరింది.
missing mother reached son after ten years in krishna district