కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని మిర్చి రైతులు అకాల వర్షాలతో అవస్థలు పడుతున్నారు. పండించిన పంటను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేసే పరదాలు ఇంకా పంపిణీ చేయకపోవటం కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. పరదాలు పంపిణీ చేసి ఉంటే పంట వర్షానికి తడిచేది కాదని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చినా... వర్షంతో నష్టపోతామేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదునుగా ప్రైవేటు దుకాణాల్లో వాటి ధరలు అమాంతం పెంచారని వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పంటను కాపాడుకోవటం ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
అకాల వర్షంతో అపార నష్టం - జగ్గయ్యపేట మిర్చి రైతుల అవస్థలు
అకాల వర్షాలతో మిర్చి రైతులు నష్టాల పాలవుతున్నారు. ఆరుగాలం శ్రమించి పంటను కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు.
![అకాల వర్షంతో అపార నష్టం mirchi farmer struggles in jaggayaypet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6031667-795-6031667-1581405867658.jpg)
అకాల వర్షాలతో మిర్చి రైతుల కష్టాలు