కృష్ణా జిల్లా నందిగామ మండలం చందాపురం గ్రామానికి చెందిన బాలిక ఏసుమణి.. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. నిన్న ఉదయం కాలేజీకి వెళ్లి తిరిగి ఇంటికి చేరలేదు. ఆందోళనకు గురైన బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే గ్రామానికి చెందిన రత్నరాజు అనే యువకునిపై అనుమానం వ్యక్తం చేసింది.
కాలేజీకి వెళ్లిన కుమార్తె తిరిగి రాలేదు: పోలీసులకు బాలిక తల్లి ఫిర్యాదు - కృష్ణా జిల్లా తాజా వార్తలు
కాలేజీకి వెళ్లిన తన కుమార్తె ఇంత వరకు తిరిగి ఇంటికి రాలేదని ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. విషయాన్ని పోలీసులుకు తెలిపింది. అదే గ్రామానికి చెందిన యువకుడిపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. కృష్ణా జిల్లా పరిధిలో ఈ ఘటన జరిగింది.

Minor Girl Missing