ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జోష్​గా మంత్రుల ప్రచారం.. టీ కాచిన వెల్లంపల్లి, కన్నబాబు - మంత్రి కన్నబాబు ప్రచారం వార్తలు

విజయవాడలో మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు ఎన్నికల ప్రచారంలో అందరినీ ఆకట్టుకున్నారు. కొండ‌వీడు అకాడ‌మీ నుంచి ప్రియ‌ద‌ర్శ‌ని కాల‌నీ, పాత హౌసింగ్ బొర్డు కాల‌నీల్లో ప్రచారం నిర్వహించిన మంత్రులు.. టీ దుకాణం వద్ద ఆగి.. వారు స్వయంగా టీ చేసి తాగారు. ఈ సమయంలో అక్కడ ఉన్నవారిని ఆత్మీయంగా పలకరించి.. వైకాపా అభ్యర్ధులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Ministers vellampalli srinivas and kannababu Josh campaign
జోష్​గా మంత్రులు ప్రచారం

By

Published : Feb 24, 2021, 3:33 PM IST

జోష్​గా మంత్రులు ప్రచారం

విజయవాడ మేయర్‌ పీఠాన్ని వైకాపానే కైవసం చేసుకుంటుందని మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో కొండ‌వీడు అకాడ‌మీ నుంచి ప్రియ‌ద‌ర్శ‌ని కాల‌నీ, పాత హౌసింగ్ బొర్డు కాల‌నీల్లో మంత్రులు‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్ర‌చారంలో భాగంగా టీ దుకాణం వ‌ద్ద కొద్దిసేపు ఆగిన మంత్రులు.. టీ స్టాల్ యజమానిని పలకరించి, మంత్రి స్వ‌యంగా ఛాయ్ పెట్టి.. తాగి అందరినీ ఆశ్చర్యపరిచారు.

తెదేపా పగటి కలలు కంటోంది..

వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కులమతాలు, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థుల‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. తెదేపా నేతలు పగటి కలలు కంటున్నారని, పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను వైకాపా కైవసం అవుతాయని జోస్యం చెప్పారు.

ఇవీ చూడండి...

అనిశా తనిఖీలు.. రాజకీయ కోణంలో చూడటం సబబు కాదు: మంత్రి వెల్లంపల్లి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details