ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారని మంత్రులు కొడాలి నాని ,పేర్ని నాని అన్నారు. కృష్ణాజిల్లా నందివాడ మండలం అన్నమనపూడిలో స్వయం సహాయక సంఘాల మహిళలతో కలిసి మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రూ.6 కోట్ల 80 లక్షల ఆసరా చెక్కులను మహిళలకు అందించారు.
వైఎస్ఆర్ ఆసరా చెక్కులు పంపిణీ చేసిన మంత్రులు - వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీపై కొడాలి నాని
కృష్ణాజిల్లా నందివాడ మండలం అన్నమనపూడిలో వైఎస్ఆర్ ఆసరా చెక్కులను మంత్రులు కొడాలి నాని ,పేర్ని నాని పంపిణీ చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
వైఎస్ఆర్ ఆసరా చెక్కులు పంపిణీ చేసిన మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని
రాష్ట్రంలో సీఎం జగన్ పరిపాలన చూసి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు ఈర్ష్య అని పేర్ని నాని ఆరోపించారు. గుడివాడ అంటే కొడాలి నాని.. కొడాలి నాని అంటే గుడివాడ అనే విధంగా స్థానం సంపాదించుకున్నారని మంత్రి పేర్ని నాని ప్రశంసించారు.
ఇదీ చదవండి: ఏడాది అప్పు ఐదు నెలల్లోనే!