ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 26, 2021, 9:14 PM IST

ETV Bharat / state

46 ఆస్పత్రుల్లో కొవిడ్ బాధితులకు వైద్య చికిత్స: మంత్రులు

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు కృష్ణా జిల్లా యంత్రాంగం పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తోందని మంత్రి పేర్ని నాని తెలిపారు. జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలతో సమావేశమైన మంత్రి పేర్నినాని, కొడాలి నాని పలు అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ministers kodali nani
covid situation in krishna district

కొవిడ్ పరిస్థితులపై మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని.. కృష్ణా జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు . రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు జిల్లా యంత్రాంగం పటిష్టమైన కార్యాచరణ, ప్రణాళికలను అమలు చేస్తోందని మంత్రి పేర్ని నాని తెలిపారు. వైద్య సేవలందించేందుకు మరికొంతమంది వైద్య సిబ్బందిని నియమిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 46 ఆసుపత్రులు ద్వారా కొవిడ్ బాధితులకు వైద్య చికిత్సలు అందుతున్నాయని తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా సమాంతరంగా చేపట్టామన్నారు. ఇప్పటికే 4,70,000 మందికి పైగా వ్యాక్సినేషన్ ఇచ్చామన్నారు. కొవిడ్ వ్యాప్తి, బెడ్స్, వైద్య సేవలు, టెస్ట్​లు, ఆక్సిజన్, మందులు, అంబులెన్స్​లు, 104 సేవలు వంటి 25 రకాల సేవలపై ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నామని వెల్లడించారు. టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్ మెంట్​కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details