కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న నిమ్రా కోవిడ్ ఆస్పత్రిపై.. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్, వసంత కృష్ణ ప్రసాద్, కలెక్టర్ మహ్మద్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ శివశంకర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పరిశీలించారు. నిమ్రా హస్పటల్ యాజమాన్య నిర్లక్ష్య వైఖరి వల్ల కోవిడ్ పేషెంట్లు పడుతున్న ఇబ్బందులు గురించి అందిన ఫిర్యాదు మేరకు తనిఖీ చేపట్టామని అధికారులు పేర్కొన్నారు.
కొవిడ్ ఆస్పత్రిని సందర్శించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ - ఇబ్రహీంపట్నం నిమ్రా కోవిడ్ హస్పిటల్
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని కోవిడ్ సెంటర్ను మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పరిశీలించారు.
![కొవిడ్ ఆస్పత్రిని సందర్శించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-vlcsnap-2021-05-15-18h58m13s492-1505newsroom-1621085351-494.jpg)
ఆసుపత్రిని పరిశీలించిన మంత్రులు, అధికారులు
Last Updated : May 16, 2021, 3:20 PM IST
TAGGED:
ibrahimpatnam Covid Centre