వైకాపా నేత దుట్టా రామచంద్రరావు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గాల మధ్య గన్నవరం నియోజకవర్గంలో మనస్పర్థాలు రావడంతో వారితో మంత్రులు వెల్లంపల్లి, కొడాలి నాని చర్చించారు. వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో ఇద్దరిది చెరోదారి అన్నట్లు వ్యవహరించారు. దీంతో మంత్రులు ఇరువురిని కూర్చోబెట్టి చర్చలు జరిపారు. గన్నవరంలో పలువురు వైకాపాలో చేరగా.. వారికి కండువాలు కప్పి మంత్రులు ఆహ్వానించారు.
ఎమ్మెల్యే వంశీ, వైకాపా నేత దుట్టాతో మంత్రుల చర్చలు! - ఎమ్మెల్యే వంశీతో కొడాలి నాని మీటింగ్ న్యూస్
కృష్ణా జిల్లా గన్నవరం రాజకీయ పంచాయితీని సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రులు వెల్లంపల్లి, కొడాలి నానికి అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఎమ్మెల్యే వంశీ, వైకాపా నేత దుట్టా రామచంద్రరావుతో మంత్రులు చర్చించారు.
ministers discurshion with mla vamishi and ysrcp leader dutta