విజయవాడ వన్ టౌన్ కేబీఎన్ కళాశాలలో నూతనంగా ప్రవేశపెట్టిన మూడు డిప్లొమా కోర్సులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూల సురేష్, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి అవినీతి, పక్షపాతానికి తావులేకుండా అమ్మ ఒడి అందిస్తున్నామని మంత్రి సురేష్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అమ్మఒడిపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్న ఆయన... అలాంటివి ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
కేబీఎన్ కళాశాలలో డిప్లొమా కోర్సులను ప్రారంభించిన మంత్రులు - విజయవాడలో కేబీఎన్ కళాశాల వార్తలు
అమ్మ ఒడి రెండో విడత ఈ నెల 11న నెల్లూరులో సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూల సురేష్ తెలిపారు. విజయవాడ వన్ టౌన్ కేబీఎన్ కళాశాలలో నూతనంగా ప్రవేశపెట్టిన మూడు డిప్లొమా కోర్సులను మంత్రులు ఆదిమూల సురేష్, వెల్లంపల్లి శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు.
కేబీఎన్ కళాశాలలో డిప్లొమా కోర్సులను ప్రారంభించిన మంత్రులు
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలలో చేరినట్లు తెలిపారు. ఈ ఏడాది పాఠశాలల్లో మరగు దొడ్లు మెరుగు పరచడానికి అమ్మఒడి నుంచి వెయ్యి రూపాయలను తీసుకొని ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో సదుపాయాల కల్పనలకు వాడనున్నట్లు మంత్రి సురేష్ వెల్లడించారు.
ఇవీ చూడండి...