ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కనకదుర్గను దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి - kanakadurga temple latest updates

మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు.. కుటుంబ సభ్యలతో కలసి విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. రూ.16 ల‌క్షలు విలువ చేసే ముత్యాల హారాన్ని అమ్మవారికి కానుక‌గా సమర్పించారు.

minister vellampally visited kanakadurga temple
కనకదుర్గను దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి

By

Published : Mar 28, 2021, 6:54 AM IST

దేవాదాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు.. కుమార్తె సాయి అశ్విత జ‌న్మదిన సంద‌ర్భంగా కుటుంబ స‌భ్యలతో కలసి క‌న‌క‌దుర్గమ్మను దర్శించుకున్నారు. రూ.16 ల‌క్షలు విలువ చేసే ముత్యాల హారాన్ని అమ్మవారికి కానుక‌గా సమర్పించి... ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దుర్గఘాట్ వ‌ద్ద 3500 అడుగ‌ల విస్తీర్ణంలో వెలంపల్లి మహాలక్ష్మమ్మ, అవ‌నీష్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.20 ల‌క్షలతో నిర్మించిన పిండ‌ ప్రదానం రేకుల షెడ్డును ప్రారంభించారు. 100 మంది బ్రాహ్మణుల‌కు వస్త్రాలు, వ్యాపారుల‌కు తోపుడు బ‌ళ్లు బహుకరించారు. అన్నిరకాల పూజా మార్గాల్లోనూ భక్తి మార్గం అత్యున్నతమైందన్నారు మంత్రి.

ABOUT THE AUTHOR

...view details