ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం: మంత్రి వెల్లంపల్లి - మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తాజావార్తలు

విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్​లో హరే కృష్ణా మూవ్‌మెంట్‌ ఇండియా ఆధ్వర్యంలో నిత్యాన్నదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు పేదలకు భోజనం ప్యాకెట్లను అందించారు.

food distribution
భోజనం పంపిణీ

By

Published : May 25, 2021, 4:31 PM IST

విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్​లో హరే కృష్ణా మూవ్‌మెంట్‌ ఇండియా ఆధ్వర్యంలో సుభోజనం పేరిట నిత్యాన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీని ద్వారా పేదలు, నిరాశ్రయులకు ఆహారం అందిస్తున్నారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆహారం పంపిణీ చేశారు.

కర్ఫ్యూ సమయంలో నగరంలోని నిరాశ్రయులు ఆకలితే ఉండకూడదనే ఉద్ధేశంతో స్వచ్చంద సంస్థలు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని మంత్రి అన్నారు.

ఇదీ చదవండి:కొవిడ్ ఆస్పత్రి మూడో అంతస్తుపై నుంచి దూకి.. కరోనా రోగి ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details