ప్రభుత్వం నిర్ణయం మేరకు తెల్లకార్డుదారులకు ఇవాళ్టి నుంచి బియ్యం, కందిపప్పు ఉచితంగా ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరుకులు పంపిణీ చేస్తామన్నారు. సరుకులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని... వచ్చే నెల 15 వరకు ఎవరికీ ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. సామాజిక దూరం పాటిస్తూ... ఇంటికి ఒకరు మాత్రమే వచ్చి సరుకులు తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. వేలిముద్రలు, ఐరిస్ లేకుండానే... సంతకం చేసి తీసుకుంటే సరిపోతుందని సూచించారు.
విదేశాల నుంచి వచ్చేవారి సమాచారం సేకరిస్తున్నాం