ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Minister Vellampalli: 'పారదర్శకత కోసమే బీసీ సంక్షేమశాఖలోకి బ్రాహ్మణ కార్పొరేషన్' - ఏపీ తాజా వార్తలు

ఓసీ కేటగిరీలోని పలు కులాలు కలిపి ఈబీసీ శాఖగా చేసే యోచనలో ఉన్నామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ (Minister Vellampalli news ) వెల్లడించారు. సీఎం సమీక్ష తరువాత మీడియాతో మాట్లాడిన మంత్రి.. పారదర్శకత కోసమే బీసీ సంక్షేమశాఖలో బ్రాహ్మణ కార్పొరేషన్ విలీనం నిర్ణయం తీసుకున్నామని (APBWC merger with BC corporation news) చెప్పారు.

Minister Vellampalli
Minister Vellampalli

By

Published : Sep 27, 2021, 3:37 PM IST

అర్చకులకు ఇళ్ల కేటాయింపుపై ముందుకెళ్లాలని సీఎం ఆదేశించారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్(Minister Vellampalli news) వెల్లడించారు. దేవాలయాల అభివృద్ధిపై సీఎం సమీక్షించిన(CM Jagan Review on Endowments Department news) అనంతరం.. మంత్రి మీడియాతో మాట్లాడారు. వంశపారంపర్య అర్చకులకు వేతనాలు పెంచామని చెప్పారు. ఆలయాల్లో టికెట్ల జారీకి ఆన్‌లైన్ విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని వెల్లడించారు.

'ఆలయాల్లో మెరుగైన వసతులు కల్పించాలని సీఎం ఆదేశించారు. సమగ్ర భూసర్వేలో ఆలయ భూములకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆలయ భూములు దేవుడికే చెందేలా చూడాలని సూచించారు. గుడుల్లో అవినీతి నిరోధించేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. సాంస్కృతిక అంశాల అభివృద్ధి కోసమే 'ధర్మపథం' చేపట్టాం. 'నాద నీరాజనం' ప్రధాన ఆలయాల్లో అమలుచేయాలని నిర్ణయించాం. పారదర్శకత కోసమే బీసీ సంక్షేమశాఖలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ విలీన నిర్ణయం తీసుకున్నామని చెప్పారు . ఓసీ కేటగిరీలోని పలు కులాలు కలిపి ఈబీసీ శాఖగా చేసే యోచన ఉన్నాం' - వెల్లంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి

ABOUT THE AUTHOR

...view details