ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Vellampalli: ప్రత్యేక హోదా సాధన మా ప్రధాన అజెండా: వెల్లంపల్లి - CM jagan delhi tour

విభజన హామీల సాధన కోసమే సీఎం జగన్ దిల్లీ వెళ్లారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం గతంలో వైకాపా ఎంపీలు రాజీనామా చేసిన అంశాన్ని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాపై మాట్లాడే నైతికహక్కు తెదేపాకు లేదని స్పష్టం చేశారు.

minister vellampalli srinivas giving clarification on CM jagan tour
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

By

Published : Jun 11, 2021, 3:08 PM IST

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

విభజన హామీల సాధన కోసమే ముఖ్యమంత్రి జగన్ దిల్లీ వెళ్లారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రత్యేక హోదా అంశం అజెండాలో మొదటి స్థానంలో ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి దిల్లీ పర్యటనపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలను మంత్రి కొట్టిపారేశారు. గతంలో ప్రత్యేకహోదా కోసం ఐదుగురు ఎంపీలను జగన్ రాజీనామా చేయించారని వెల్లంపల్లి గుర్తు చేశారు. ప్రత్యేక హోదాపై మాట్లాడే నైతిక హక్కు తెలుగుదేశం పార్టీకి లేదన్నారు. విజయవాడ 35వ డివిజన్‌లో నగరపాలక సంస్థ కమిషనర్‌తో కలిసి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పర్యటించారు.

ABOUT THE AUTHOR

...view details