దేవాలయాలపై కక్షపూరితంగా.. ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వం ఏదీ చేయలేదని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. దీనిపై కాణిపాకం వినాయకుని వద్ద తాను ప్రమాణం చేసేందుకు సిద్దమని తెలిపారు. ఇదే సమయంలో తాను అడిగే 5 అంశాలపై ప్రతిపక్షనేత చంద్రబాబు కూడా ప్రమాణం చేసేందుకు ముందుకు రావాలని సవాల్ విసిరారు.
సీఎంగా ఉన్నప్పుడు ఏ ఆలయం కూల్చలేదని, ధ్వంసం చేయలేదని, ఏ గోకులాలను కూల్చలేదని, దేవాలయ భూములను బినామీలు, పార్టీ నేతలకు దోచి పెట్టలేదని, బూట్లతో పూజలు చేయలేదని చంద్రబాబు ప్రమాణం చేయగలుగుతారా అని మంత్రి ప్రశ్నించారు. ప్రమాణం చేయలేకపోతే చంద్రబాబు హిందువుల ద్రోహి అన్నట్లేనన్నారు. విజయవాడ దుర్గగుడి ఆలయం భద్రతా లోపం ఉందని... దీనిపై తమకూ అనుమానాలున్నాయన్నారు.