కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు నాయకులు సైతం రంగంలోకి దిగుతున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ నగర వీధుల్లో వైరస్ నివారణకు రసాయన ద్రావణాన్ని పిచికారి చేశారు. అన్ని వీధుల్లో పర్యటిస్తూ, పింఛన్ల పంపిణీ, రేషన్ సరఫరాను పర్యవేక్షించారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ప్రభుత్వం కరోనా నివారణకు చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ అందేలా ఏర్పాట్లు చేశామన్నారు. వాలంటీర్ల వ్యవస్థపై రాజకీయాలు చేయవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రసాయన ద్రావణం పిచికారి చేసిన మంత్రి వెల్లంపల్లి - విజయవాడలో మంత్రి వెల్లంప్లలి
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అగ్నిమాపక సిబ్బంది అవతారమెత్తారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు విజయవాడ వీధుల్లో రసాయన ద్రావణాన్ని పిచికారి చేశారు. అర్హులైన అందరికీ రేషన్ పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.
విజయవాడ వీధుల్లో వైరస్ నివారణ రసాయనాన్ని పిచికారి చేసిన మంత్రి వెల్లంపల్లి