విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కొండ ప్రాంతాల్లో నివసిస్తోన్న వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్టు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. నగరంలోని దేవాదాయ శాఖ భవన సముదాయంలో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. అర్హులందరికీ ఉగాది నాటికి ఇళ్లు, ఇళ్ల పట్టాలివ్వాలని సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. కొండ ప్రాంతాల్లో ఉన్నవారికి ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేయించేందుకు, రైల్వే, ఇతర ప్రభుత్వ భూముల్లో ఉంటున్నవారిని క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీని కోసం అవసరమైతే సర్వే చేసేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని సూచించారు.
కొండ ప్రాంతాల్లో ఉన్నవారికీ.. ఇళ్ల పట్టాలు..! - minister vellampalli latest news in vijayawada
విజయవాడలో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అధికారులతో సమావేశమయ్యారు. కొండ ప్రాంతాల్లో ఉన్నవారికి సైతం ఇళ్ల పట్టాలిప్పించే విషయమై చర్చించారు.
minister-vellampalli