విదేశీ ప్రయాణికుల నుంచి మొదలైన కేసులు... సామాజిక వ్యాప్తి వరకు చేరాయని... ఇప్పటివరకు జిల్లాలో రెండు లక్షల ఎనిమిది వేలమంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించినట్లు మంత్రి వెల్లంపల్లి తెలిపారు. రాష్ట్ర కొవిడ్ ఆసుపత్రిగా విజయవాడలోని జీజీహెచ్, కృష్ణా జిల్లా ఆసుపత్రులుగా పిన్నమనేని సిద్దార్థ, నిమ్రా ఆసుపత్రులను ఎంపిక చేసి వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ కొవిడ్ బాధితులకు వైద్యం చేయాల్సిందిగా ఆదేశించామని అన్నారు. ప్రజలు భయాందోళనలు చెందొద్దని-ఎక్కువ కేసులు నమోదవుతున్న ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని విజయవాడ నగరంలో 11 చోట్ల మాత్రమే కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేశామని- ఇతర ప్రాంతాల్లో ఎలాంటి ఆంక్షలు లేవని వెల్లంపల్లి తెలిపారు
కృష్ణా జిల్లాలోనే అధిక కరోనా పరీక్షలు: వెల్లంపల్లి - ఏపీ కొవిడ్ కేసులు న్యూస్
కరోనా పరీక్షలు చేయడంలో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలోని కలెక్టరు క్యాంపు కార్యాలయంలో అధికారులతో జిల్లాలో కొవిడ్ కేసులు, అందిస్తోన్న వైద్య సేవలపై సమీక్షించారు.
minister vellampalli on krishna district covid tests
ఇదీ చదవండి: 'రఫేల్' ప్రత్యేకతలతో వాయుసేన మరింత బలోపేతం