ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంద్రకీలాద్రిలో దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష - ఇంద్రకీలాద్రిలో దసరా ఉత్సవాలు

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో మంత్రి వెల్లంపల్లి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ ఇంతియాజ్, పలువురు అధికారులు పాల్గొన్నారు. పారిశుద్ధ్యం, రవాణా, భద్రతా విషయాల గురించి మంత్రికి వివరణ ఇచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు.

ఇంద్రకీలాద్రిలో దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష

By

Published : Sep 7, 2019, 3:31 PM IST

ఇంద్రకీలాద్రిపై నిర్వహించనున్న దసరా ఉత్సవాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి కలెక్టర్ ఇంతియాజ్, జేసీ మాధవీలత, దుర్గ గుడి ఈవో సురేష్ బాబు... నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న, పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ నెల 29నుంచి ప్రారంభం కానున్న వేడుకలకు పారిశుద్ధ్యం, రవాణా, భద్రతా విషయాలలో తీసుకుంటున్న జాగ్రత్తలపై అధికారులు మంత్రికి వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్యయంతో పని చేయాలని మంత్రి సూచించారు.

ABOUT THE AUTHOR

...view details