దేవాలయాల్లో అభివృద్ధిపై అవినీతి నిరోధకశాఖ తనిఖీలు చేస్తే...వాటిని కూడా రాజకీయ కోణంలో చూడటం సబబు కాదని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45వ డివిజన్లో వైకాపా అభ్యర్థి తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ హయాంలోనే శ్రీశైలం దేవస్థానం ఈవోని సస్పెండ్ చేశామనీ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో అవినీతి అధికారులు, ఉద్యోగులను ప్రక్షాళన చేయటం వంటి పనులు చేశామన్నారు. అదే విధంగా దుర్గ గుడిలో అవినీతి ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా.. తమ ప్రభుత్వ పరిరక్షణలో సస్పెన్షన్లు బదిలీలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. తెదేపా ఎంపీ కేశినేని నాని తనపై ఆరోపణలు చేయడం మానుకుని అభివృద్ధి కోసం పని చేయాలని మంత్రి అన్నారు.
అనిశా తనిఖీలు.. రాజకీయ కోణంలో చూడటం సబబు కాదు: మంత్రి వెల్లంపల్లి - minister vellampalli recent news
విజయవాడ 45 డివిజన్లో వైకాపా అభ్యర్థి తరఫున.. మంత్రి వెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేవాలయాల్లో అభివృద్ధిపై అనిశా తనిఖీలు జరుగుతాయనీ.. వాటిని రాజకీయ కోణంలో చూడటం సబబు కాదని అన్నారు.
విజయవాడ 45 డివిజన్ మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి వెల్లంపల్లి ప్రచారం