ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కూచిపూడిలో కళా ఉత్సవాలను ప్రారంభించిన మంత్రి సురేశ్ - కూచిపూడిలో కళా ఉత్సవాలు

కృష్ణా జిల్లా కూచిపూడిలో కళా ఉత్సవాలను మంత్రి ఆదిమూలపు సురేశ్​ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం కళలను పోషించే దిశగా అడుగులు వేస్తోందని మంత్రి అన్నారు.

కూచిపూడిలో కళా ఉత్సవాలను ప్రారంభించిన మంత్రి సురేశ్
కూచిపూడిలో కళా ఉత్సవాలను ప్రారంభించిన మంత్రి సురేశ్

By

Published : Dec 19, 2020, 6:04 PM IST

కృష్ణా జిల్లా కూచిపూడిలో మంత్రి ఆదిమాలపు సురేశ్ కళా ఉత్సవాలను ప్రారంభించారు. విద్యతో పాటు సాంస్కృతిక కళలపై ఆసక్తిని పెంపొందించటం కోసం కళాఉత్సవ్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి సురేశ్ పేర్కొన్నారు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 300 మంది కళాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నట్లు ఆయన వెల్లడించారు. నూతన విద్యావిధానంలో అనేక మార్పులను తీసుకువచ్చేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్, విద్యా శాఖ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details