ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలుగు నేల ఉన్నంత వరకు.. ఘంటశాల పాట నిలిచి ఉంటుంది: మంత్రి రోజా - ఏపీలో ఘంటసాల వార్తలు

Minister Roja: తెలుగు నేల ఉన్నంత వరకు ఘంటశాల పాట నిలిచి ఉంటుందని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. విజయవాడలో ఘంటసాల సంగీత కళాశాలలో నిర్వహించిన.. జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఆయన జీవితం యువతకు ఆదర్శమని వ్యాఖ్యానించారు. ఘంటశాల కేవలం గాయకుడే కాదు స్వాతంత్య్ర పోరాట యోధుడిగా మంత్రి రోజా అభివర్ణించారు. ఘంటశాలకు భారతరత్న కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Ghantasala Jayanthi Celebration
ఆర్‌కే రోజా

By

Published : Dec 4, 2022, 3:31 PM IST

Updated : Dec 4, 2022, 9:12 PM IST

Ghantasala Jayanthi Celebration in AP: తెలుగు నేల ఉన్నంత వరకు ఘంటశాల పాట నిలిచి ఉంటుందని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. విజయవాడలోని ఘంటశాల సంగీత కళాశాలలో ఘంటసాల జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రముఖులు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణుతోపాటు సాంస్కృతికశాఖ అధికారులు, సంగీత అభిమానులు పాల్గొన్నారు.

ఘంటశాల జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి రోజా

ఘంటశాల కృష్ణా జిల్లా వాసి కావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం. తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొని నిలిచారనడానికి ఘంటశాల జీవితం ఓ నిదర్శనం.తన తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు కఠోరంగా శ్రమించి విజయం సాధించారు. ఘంటశాల కేవలం గాయకుడే కాదు.. స్వతంత్ర పోరాట యోధుడు.మహాత్మాగాంధీ ప్రభావం ఘంటశాలపై పడటం వలనే ఆయన ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిలించేందుకు.. తన పాటల ద్వారా ప్రయత్నం చేశారు. 18 నెలలు జైలుకు వెళ్లినా.. తన లక్ష్యం నుంచి ఘంటశాల వెనకడుగు వేయలేదు. ఘంటశాలకు భారతరత్న ఇచ్చే విధంగా మనమంతా కలిసికట్టుగా కృషి చేయాలి. -రోజా, మంత్రి

ఇవీ చదవండి:

Last Updated : Dec 4, 2022, 9:12 PM IST

ABOUT THE AUTHOR

...view details