
రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) మాతృమూర్తి నాగేశ్వరమ్మ గురువారం తుదిశ్వాస విడిచారు. ఆమె కొద్దిరోజులుగా గుండె సంబంధిత వ్యాధితో మచిలీపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం కన్నుమూశారు. భౌతికకాయాన్ని మచిలీపట్నంలోని పేర్ని నివాసానికి తీసుకురాగా... పలువురు ప్రముఖులు, స్థానికులు నివాళులు అర్పించారు.