కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పేర్ని నాని ప్రారంభించారు. రైతు గ్రామ సరిహద్దులు దాటకుండానే ధాన్యం విక్రయించవచ్చని మంత్రి పేర్ని తెలిపారు. గిట్టుబాటు ధరకు విక్రయించుకునేలా పటిష్ఠ విధానం తీసుకొచ్చామని అన్నారు. సాధారణ రకం వరి క్వింటా రూ.1868 చెల్లిస్తామని తెలిపారు. గ్రేడ్ ఏ రకం వరి క్వింటాలుకు రూ.1888 చెల్లింపు చేస్తామని మంత్రి పేర్ని నాని అన్నారు.
'ధాన్యం గిట్టుబాటు ధరకు విక్రయించుకునేలా పటిష్ఠ విధానం' - Paddy msp in andhra pradesh
రైతులు ధాన్యం గిట్టుబాటు ధరకు విక్రయించుకునేలా పటిష్ఠ విధానం తీసుకొచ్చామని మంత్రి పేర్ని నాని అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
minister perni nani on paddy MSP