ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Perni: గురజాడ-మంటాడ వద్ద అండర్ పాస్ నిర్మిస్తాం: మంత్రి పేర్ని నాని - పేర్ని నాని న్యూస్

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి పేర్నినాని స్పష్టం చేశారు. విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై గురజాడ-మంటాడ వద్ద అండర్ పాస్ నిర్మిస్తామని వెల్లడించారు.

గురజాడ-మంటాడ వద్ద అండర్ పాస్ నిర్మిస్తాం
గురజాడ-మంటాడ వద్ద అండర్ పాస్ నిర్మిస్తాం

By

Published : Sep 11, 2021, 8:30 PM IST

విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై గురజాడ-మంటాడ వద్ద అండర్ పాస్ నిర్మిస్తామని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. పామర్రు నియోజకవర్గ అభివృద్ధిపై జిల్లా మంత్రి కొడాలి నాని, కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్​లతో కలిసి సమీక్ష నిర్వహించారు.

గురజాడ- మంటాడ ప్రాంతంలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నందున అండర్ పాస్ నిర్మించాలని హైవే అధికారులను కోరామని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఈ అంశంపై కలెక్టర్ అధ్యక్షతన ల్యాండ్ వెరిఫికేషన్ జరిపి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే పాముల లంక బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసామని.., స్థల సేకరణ కూడా పూర్తయిందన్నారు. త్వరలో బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details