రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని చరవాణి..చోరికి గురైంది. సచివాలయంలో ఆర్థిక శాఖ సమీక్షకు హాజరైన మంత్రి..రవాణా, సమాచార శాఖ కేటాయింపులపై ప్రతిపాదనలు సమర్పించారు. అనంతరం సందర్శకులతో మాట్లాడుతుండగా ఆయన సెల్‌ఫోన్‌ను గుర్తుతెలియని ఆగంతకుడు తస్కరించాడు. సచివాలయంలో బ్లాక్ 2, బ్లాక్ 4లో సమావేశాలు ముగిసిన అనంతరం.... సచివాలయ క్యాంటీన్‌లో భోజనం చేస్తుండగా ఫోన్ పోయినట్టు మంత్రి గుర్తించారు. వెంటనే సచివాలయ భద్రతా సిబ్బంది... ఫోన్ కోసం ఆరా తీయగా అప్పటికే రాష్ట్రం సరిహద్దులు దాటి నల్గొండలో ఉన్నట్లుగా సిగ్నల్ లోకేషన్ నమోదైంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సరిహద్దులు దాటిన మంత్రి గారి చరవాణి..!
రాష్ట్ర మంత్రి పేర్ని నాని చరవాణి చోరీకి గురైంది. సచివాలయంలో ఆర్థికశాఖ సమీక్షకు మంత్రి హాజరయ్యారు. అనంతరం సందర్శకులతో మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తి సెల్‌ఫోన్‌ను దొంగలించాడు.
చోరికి గురైన మంత్రి పేర్ని నాని మొబైల్ ఫోన్