ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Perni nani : పామర్రు బస్టాండ్​ను పరిశీలించిన మంత్రి పేర్ని నాని - minister perni nani in in krihsna district

కృష్ణా జిల్లాలో నీట మునిగిన పామర్రు బస్టాండ్(pamarru bus stand )​ను మంత్రి పేర్నినాని(perni nani) పరిశీలించారు. మౌలిక సదుపాయాలు కల్పించి, బస్టాండ్ పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చుదిద్దుతామని హామీ ఇచ్చారు.

minister perni nani inspected pamarru busstand in krihsna district
పామర్రు బస్టాండ్​ను పరిశీలించిన మంత్రి పేర్ని నాని

By

Published : Jul 2, 2021, 3:29 PM IST

కృష్ణా జిల్లా పామర్రులో నీటమునిగిన బస్టాండ్​ను రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే అనిల్​కుమార్, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పరిశీలించారు. డ్రైనేజీ నీరు కూడా బస్టాండ్ ఆవరణలోకి చేరడంతో నీరు బయటికి వెళ్లే సౌకర్యం లేక దుర్వాసన వస్తోందని, ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులు కల్పించి, ప్రధాన రహదారి వెంట ఉన్న ఈ బస్టాండును ఆహ్లాదకరంగా మారుస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details