ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టీ తాగుతూ మంత్రి పేర్ని నాని ఏం చేశారంటే? - minister peeni nani turned to common man

మంత్రి పేర్ని నాని.. ఓ సామాన్యుడి అవతారమెత్తారు. ఇవాళ ఉదయం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీ తాగుతూ ప్రజలతో ముచ్చటించారు. రహదారి డివైడర్‌పై కూర్చుని వారితో మాట కలిపారు.

minister peeni nani turned to common man
సామాన్య పౌరుడిగా మంత్రి పేర్ని నాని

By

Published : Mar 4, 2020, 1:34 PM IST

సామాన్య పౌరుడిగా మంత్రి పేర్ని నాని

రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని.. ఓ సామాన్య పౌరుడిగా రోడ్డుపై తిరుగుతూ ప్రజలను ఆశ్చర్యపరిచారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పరిస్థితులు తెలుసుకునేందుకు తన అనుచరగణం లేకుండా ఇవాళ తెల్లవారుజామున ద్విచక్రవాహనంపై పర్యటనకు వెళ్లారు. పరాసుపేట సెంటర్​లో ఓ సాధారణ టీకొట్టు వద్ద టీ తాగుతుండగా.. ప్రజలు ఆయన్ను గుర్తించారు. అక్కడే రహదారి డివైడర్‌పై కూర్చుని మంత్రి ప్రజలతో మాట కలిపారు. సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. స్థానికులు తెలిపిన సమస్యలపై.. ఆయన వెంట తెచ్చుకున్న వాకీటాకీ ద్వారా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details