స్థానిక సంస్థల ఎన్నికల్లో వాలంటీర్లు ఎక్కడా వైకాపా కోసం పని చేయడం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో వాలంటీర్లను వినియోగించమని ఎన్నికల సంఘం చెప్పినా ప్రతిపక్ష తెదేపా ఆరోపణలు చేయడం సరైనది కాదని హితవు పలికారు. ప్రస్తుతం ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డులు సహా 60 రకాల పనులపై వాలంటీర్లు పని చేస్తున్నారని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే చంద్రబాబు నాయుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెదేపా నుంచి సతీష్ రెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్, రెహమాన్లు ఎందుకు బయటకు వచ్చారో చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. గ్రామ సచివాలయాలకు వైకాపా రంగులు వేయాలని తాము ఎక్కడా సూచించలేదన్నారు. ఉగాది నాడు ఇళ్లపట్టాల పంపిణీకి అనుమతించాలని ఎన్నికల కమిషన్కు ప్రభుత్వం లేఖ రాసిందని ... అనుమతి వస్తే పంపిణీ చేస్తామని లేదంటే ఎన్నికల తర్వాత పంపిణీ చేస్తామని తెలిపారు.
'గ్రామ వాలంటీర్లను ఎన్నికల విధుల్లో వినియోగించటం లేదు' - చంద్రబాబును విమర్శించిన మంత్రి పెద్దిరెడ్డి
తెదేపా అధినేతపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల్లో తెదేపా ఓడిపోతుందని తెలిసే చంద్రబాబు ఇష్టానుసారం మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు.
చంద్రబాబును విమర్శించిన మంత్రి పెద్దిరెడ్డి