ఉదయం సమయంలో ప్రజలంతా గుంపులు గుంపులుగా బయటికి రావొద్దని మంత్రి కొడాలి నాని పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా గుడివాడ ఆర్డీవో కార్యాలయంలో పోలీస్, మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిచారు. కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. అనంతరం సిబ్బందికి శానిటైజర్స్, మాస్కులు పంపిణీ చేశారు. గ్రామాల్లో ఇబ్బందిపడుతున్న ప్రజలకు... వైకాపా కార్యకర్తలు తమ వంతు సాయం అందించాలని మంత్రి పిలుపునిచ్చారు.
బయటికి గుంపులుగా రావొద్దు: మంత్రి కొడాలి నాని - latest updates of corona cases
లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలెవరూ గుంపులుగా బయటకి రావొద్దని మంత్రి కొడాలి నాని కోరారు. ఇంటికి ఒకరు చొప్పున మాత్రమే బయటికి వచ్చి కావాల్సిన సరుకులను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
minister kodalni nani appeal to the people over social distancing