ఈ నెల 11న మహాశివరాత్రి సందర్భంగా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దీపార్చన కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ వస్తుండడంతో మంత్రులు, అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. బందోబస్తు, ఏఎన్ఆర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ మొదలైన ఏర్పాట్లను మంత్రి కొడాలి నాని, ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, జాయింట్ కలెక్టర్ మాధవీ లత ఇతర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.
రాష్ట్ర ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తూ...మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ స్టేడియం నందు, శివాభిషేకం, భారీగా పూర్ణాహుతి హోమాన్ని నిర్వహిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు.