కరోనా వ్యాప్తితో రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతోంది. దీంతో అనేక మంది ఉపాధి కోల్పోయారు. కృష్ణా జిల్లా గుడివాడలో లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేద బ్రాహ్మణులకు మంత్రి కొడాలినాని నిత్యావసరాలు పంపిణీ చేశారు. పట్టణంలోని పురోహితులకు శుభకార్యాలు, ఆలయాల్లో పూజలు లేక ఆదాయమార్గం కోల్పోయిన బ్రాహ్మణులకు బియ్యం, కూరగాయలు ఆందించారు. తాటాకు విసనకర్రతో పురోహితుడికు విసిరి మరీ నిత్యావసరాలను పంపిణీచేశారు.
పేద బ్రాహ్మణులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన మంత్రి - గుడివాడలో పేద బ్రాహ్మణులకు నిత్యావసరాలు పంపిణీ
లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదబ్రాహ్మణులకు కృష్ణాజిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
![పేద బ్రాహ్మణులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన మంత్రి minister kodali](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7002010-385-7002010-1588243515156.jpg)
minister kodali