మంత్రి కొడాలి నాని తీరు మార్చుకోవాలని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. అధికార బలంతో ప్రశ్నించిన వారిపై దాడి చేయించటం హేయమైన చర్య అని మండిపడ్డారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఇటీవల మంత్రి కొడాలి నాని అనుచరుల దాడిలో గాయపడిన కార్యకర్తలను అశోక్ బాబు పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
మంత్రి కొడాలి నాని తీరు మార్చుకోవాలి: ఎమ్మెల్సీ అశోక్ బాబు - ఎమ్మెల్సీ అశోక్బాబు వార్తలు
కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని అనుచరుల దాడిలో గాయపడిన తెదేపా కార్యకర్తలను ఎమ్మెల్సీ అశోక్ బాబు పరామర్శించారు. దాడి చేయటం హేయమైన చర్య అని మండిపడ్డారు.
mlc ashok babu
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు... మంత్రి పదవిని అభివృద్ధికి ఉపయోగించాలి. అంతేకానీ బూతులు తిట్టడానికి... దాడులు చేయడానికి కాదు. కొడాలి నాని ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే.... గుడివాడ ప్రజలు తగిన బుద్ధి చెబుతారు -అశోక్ బాబు, తెదేపా ఎమ్మెల్సీ