ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని సీఎంకు చెప్పా' - kodali nani on amaravati news

అమరావతిలో శాసన రాజధాని కూడా ఉండేందుకు వీల్లేదని ముఖ్యమంత్రి జగన్​ను కలిసి చెప్పినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. దీనిపై అన్ని పక్షాలతో మాట్లాడి నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పారంటూ మంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

kodali nani
kodali nani

By

Published : Sep 8, 2020, 5:40 AM IST

పేద ప్రజలు ఉండేందుకు వీల్లేని అమరావతిలో శాసన రాజధాని కూడా ఉండేందుకు వీల్లేదని ముఖ్యమంత్రి జగన్​ను కలిసి చెప్పినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. దీనిపై అన్ని పక్షాలతో మాట్లాడి నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పారంటూ సోమవారం మంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

అమరావతిలో 55 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దానిపై కోర్టుకు వెళ్లి స్టే తీసుకురావడం విడ్డూరమని మంత్రి కొడాలి నాని విమర్శించారు. ఉచిత విద్యుత్తు సంస్కరణల్లో భాగంగా 30 వేల కోట్ల రూపాయలతో ఏపీ గ్రీన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతున్నామని, దీన్ని ఏ రైతు వ్యతిరేకించకున్న తెదేపా రాద్ధాంతం చేస్తోందని మంత్రి మండిపడ్డారు.

'చంద్రబాబుకు ప్రజల్లో బలం లేదు. ఎమ్మెల్యేలు లేరు. ఉన్నవారు జారిపోతున్నారు. లోకేశ్​ను ఎమ్మెల్యేను చేయడం ఎవరివల్లా కాదు. నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్ వెంటే ఉండి, దుష్ట శక్తులను నిర్వీర్యం చేస్తాన'ని మంత్రి కొడాలి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి

అంతర్వేది ఆలయ ఈవో బదిలీ: వెల్లంపల్లి

ABOUT THE AUTHOR

...view details