ఏడాదికి రూ.100 కోట్ల నిధులతో గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని... మంత్రి కొడాలి నాని ఉద్ఘాటించారు. అమృత పథకంలో భాగంగా ఇంటింటికీ కుళాయి కార్యక్రమాన్ని... ఎంపీ బాలశౌరితో కలిసి మంత్రి ప్రారంభించారు. గడచిన 6 నెలల్లో పట్టణంలోని బస్టాండ్ ప్రాంగణం, ఆసుపత్రి అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేయించినట్లు మంత్రి తెలిపారు. ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ... జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకొని ప్రతి ఇంటికీ కుళాయి ఏర్పాటు చేస్తామని వివరించారు.
'గుడివాడ అభివృద్ధికి ఏటా రూ.100 కోట్లు తీసుకొస్తా' - గుడివాడలో అమృత పథకాన్ని ప్రారంభించిన కొడాలి నాని
గుడివాడను అభివృద్ధి చెందిన పట్టణంగా తీర్చిదిద్దుతానని మంత్రి కొడాలి నాని హామీఇచ్చారు. గుడివాడలో ఇంటింటికీ కుళాయి పథకాన్ని మంత్రి ప్రారంభించారు.

మంత్రి కొడాలి నాని
గుడివాడలో ఎంపీ, మంత్రి పర్యటన