ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేషన్ డీలర్లు వివాదాలు సృష్టిస్తే కఠిన చర్యలు: మంత్రి కొడాలి

ప్రజలకు సరకుల పంపిణీలో రేషన్ డీలర్లు వివాదాలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొడాలి నాని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న రేషన్ డీలర్ల కమిషన్ నెలకు రూ.27 కోట్లు చొప్పున చెల్లించామని స్పష్టం చేశారు. కేంద్రమే బకాయిలు చెల్లించాలని తెలిపారు.

minister kodali nani on ration dealers
మంత్రి కొడాలి నాని

By

Published : Jul 20, 2020, 2:56 PM IST

రేషన్ సరకుల పంపిణీలో జాప్యం చేసిన డీలర్లపై చర్యలు తీసుకుంటామని మంత్రి కొడాలి నాని అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఇంటింటికీ బియ్యం పంపిణీ చేసే వాహనాల డెమోను మంత్రి పరిశీలించారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు... సమన్వయంతో కోవిడ్ కారణంగా... నెలకు రెండు సార్లు రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న రేషన్ డీలర్ల కమిషన్ నెలకు రూ.27 కోట్లు చొప్పున చెల్లించామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలు పెండింగులో ఉన్నాయన్నారు. రేషన్ డీలర్లు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాలకు వినతి పత్రాలు కాకుండా.. భాజాపా నేతల విగ్రహాలకు ఇస్తే సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details