ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి: కొడాలి నాని - గుడివాడలో అభివృద్ధి పనులు న్యూస్

ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలకిచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు.

minister kodali nani on gudiwada development
minister kodali nani on gudiwada development

By

Published : Dec 9, 2020, 7:56 PM IST

కృష్ణా జిల్లా గుడివాడలో అమృత్ పథకం నిధులతో నూతనంగా నిర్మించే రక్షిత మంచినీటి పథకానికి మంత్రి కొడాలి నాని శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం నియోజకవర్గంలో రూ.70 కోట్ల వరకు నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఆరోపించారు. గుడివాడ మండలం రామనపూడి గ్రామం నుంచి చిరిచింతల గ్రామం వరకు నాలుగు కోట్ల 35 లక్షల ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం నిధులతో చేపట్టనున్న రహదారి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.

ABOUT THE AUTHOR

...view details