రైతులకు వ్యవసాయం లాభసాటిగా చేసేందుకు ప్రతి నియోజకవర్గంలోనూ అగ్రికల్చర్ ల్యాబ్స్ నిర్మిస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. కృష్ణాజిల్లా గుడివాడ మార్కెట్ యార్డులోరూ.82 లక్షల వ్యయంతో నిర్మించనున్న వ్యవసాయ పరిశోధన కేంద్ర భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.
వ్యవసాయ పరిశోధన కేంద్రానికి మంత్రి కొడాలి నాని శంకుస్థాపన - news on agri lab at gudiwada
కృష్ణాజిల్లా గుడివాడ మార్కెట్ యార్డులో వ్యవసాయ పరిశోధన కేంద్ర భవన నిర్మాణానికి మంత్రి కొడాలి నాని భూమి పూజ చేశారు. రైతుల సంక్షేమం కోసం పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారని, సద్వినియోగం చేసుకుని లాభపడాలని ఆకాంక్షించారు.
వ్యవసాయ పరిశోధన కేంద్రానికి మంత్రి కొడాలి నాని శంకుస్థాపన
ప్రతి రైతు పరిశోధన కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు తమ భూమి సారాన్ని, వారువాడే పురుగుమందులు, విత్తనాలు నకిలీవో మంచివో తెలుసుకునే విధంగా పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేశామని కొడాలి నాని తెలిపారు.
ఇదీ చదవండి: రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారినెలా తొలగిస్తారు?: సుప్రీం