ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Minister Kodali Nani: చంద్రబాబు, పవన్ నాటకాలు ప్రజలకు తెలుసు: మంత్రి కొడాలి నాని - చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్

తెదేపా అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని(minister kodali nani news) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డ్రగ్స్ సరఫరాలో అఫ్గానిస్తాన్ కు తాడేపల్లికి లింకులున్నాయన్న చంద్రబాబు ఆరోపణలపై మండిపడ్డారు(Minister Kodali Nani Fires On chandrababu news). చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారన్న విషయం ప్రజలు గమనించారన్నారు.

Minister Kodali Nani Fires On Chandra Babu
Minister Kodali Nani Fires On Chandra Babu

By

Published : Oct 10, 2021, 3:53 PM IST

Updated : Oct 10, 2021, 5:18 PM IST

మాదకద్రవ్యాల సరఫరాలో అఫ్గానిస్థాన్​కు తాడేపల్లికి నేరుగా లింకులున్నాయన్న చంద్రబాబు ఆరోపణలపై వైకాపా మండిపడింది. సీఎంకు లింకులున్నాయని చంద్రబాబుకు ఎవరు చెప్పారో స్పష్టం చేయాలని మంత్రి కొడాలి నాని డిమాండ్ చేశారు(Minister Kodali Nani Fires On Chandra Babu news).

డ్వాక్రా సంఘాలను చంద్రబాబు నిలువునా మోసం చేశారన్న కొడాలి నాని(minister kodali nani news).. ఎన్నికల నాటికి ఉన్న అప్పును 4 విడతల్లో చెల్లిస్తానని సీఎం జగన్ (cm jagan news )హామీ ఇచ్చి నిలబెట్టుకున్నారన్నారు. రెండు విడతల్లో కలిపి 13 వేల కోట్లు మహిళా సంఘాలకు చెల్లించారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు పొందుతోన్న ప్రజలను కుక్కలతో చంద్రబాబు పోల్చుతున్నారని, ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. జగన్ బతికున్నంత వరకు రాష్ట్రానికి సీఎంగా ఆయనే ఉంటారని జోస్యం చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలసి నాటకాలు ఆడుతున్నారన్న సంగతి ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు తన కుమారుడిపై కంటే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్(minister kodali nani fires on pawan news) పైనే నమ్మకం ఎక్కువన్నారు. కమ్మ సామాజికవర్గానికి అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ చెబుతున్నందున.. జనసేనలో తెదేపా ను విలీనం చేస్తే మంచిదని సూచించారు. రాష్ట్ర ప్రజలు జనసేన, తెదేపాను భూస్థాపితం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మండిపడ్డారు.

Last Updated : Oct 10, 2021, 5:18 PM IST

ABOUT THE AUTHOR

...view details