ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'చంద్రబాబుకు ఉన్న ఏకైక మార్గం మతాన్ని అడ్డుపెట్టుకోవడమే' - latest news of gannavaram

తెదేపా అధినేత చంద్రబాబు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. మతాన్ని అడ్డంపెటుకుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. గన్నవరంలో పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి... లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు.

minister kodali nani
minister kodali nani

By

Published : Jan 7, 2021, 4:19 PM IST

కుల, మతాలకు అతీతంగా వైకాపా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి కొడాలి నాని అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందటంలో ఎలాంటి అవినీతికి చోటు ఉండదన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు ఎట్టి పరిస్థితుల్లో అందుతాయన్నారు. ప్రజల గురించి ఆలోచించే నాయకుడు సీఎం జగన్ అని స్పష్టం చేశారు.

మత మార్పిడి, ఆలయాలపై దాడుల వంటి అంశాలను ప్రతిపక్ష పార్టీలు తెరపైకి తీసుకువస్తూ..ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఉన్న ఏకైక మార్గం మతాన్ని అడ్డుపెట్టుకోవడమేనని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details