కరోనా నివారణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. కరోనా నివారణకు తమ వంతు సాయంగా కృష్ణా జిల్లా గుడివాడలో విశ్వభారతి విద్యాసంస్థ ఆధ్వర్యంలో 60 వేల రూపాయల విలువైన శానిటైజర్లు, మాస్క్లు వార్డు వాలంటీర్లకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి కొడాలి నాని చేతుల మీదుగా ప్రారంభించారు.
వార్డు వాలంటీర్లకు శానిటైజర్లు, మాస్కులు అందజేసిన మంత్రి కొడాలి - గుడివాడలో వాలంటీర్లకు మాస్కులు అందజేసిన కొడాలి
గుడివాడలో విశ్వభారతి విద్యాసంస్థ ఆధ్వర్యంలో మంత్రి కొడాలి నాని చేతుల మీదుగా వార్డు వాలంటీర్లకు శానిటైజర్లు, మాస్కులు అందజేశారు. సీఎం సహాయ నిధికి విరాళం అందించిన చర్చి ఫాదర్ను మంత్రి అభినందించారు.
వార్డు వాలంటీర్లకు మాస్కులు అందజేసిన మంత్రి కొడాలి
గుడివాడ చర్చి ఫాదర్ బర్నదాస్ తనవంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి లక్ష రూపాయల చెక్కును మంత్రి కొడాలి నానికి అందజేశారు. ఆపద సమయంలో ప్రజలకు సేవ చేయటానికి ముందుకు వస్తున్న దాతలను మంత్రి నాని అభినందించారు.
ఇదీ చదవండి:'ముస్లింలకు సీఎం జగన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలి'